ఏ దృశ్యమైనా చూపించే విధానంలో కొత్తదనముంటే.. అది ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందుకే ఆధునిక సాంకేతిక అందిపుచ్చుకుని వెండితెర మీద వెలుగులు పంచేందుకు వినూత్న రీతిలో ముందుకు వస్తున్నారు మన దర్శక నిర్మాతలు. మారుతున్న ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా.. తెలుగు వెండితెరపై హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్స్‌తో సన్నివేశాలను అలంకరిస్తున్నారు. మన సినిమాటోగ్రాఫర్లు వీరికి ఏమాత్రం తీసిపోని విధంగా చిత్రాలు తీస్తున్నా, వీరికి డేట్లు సర్దుబాటు కావడం లేదు. దీంతో కథకు తగ్గట్లు పని చేసే విదేశీ కెమెరామెన్లతో రంగంలోకి దిగడానికి దర్శక నిర్మాతలు ఏ మాత్రం వెనకాడటం లేదు. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పలు సినిమాలకు హాలీవుడ్ కెమెరామెన్లు పనిచేస్తున్నారు. దృశ్య కావ్యాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
స్పెయిన్ నుంచి.. విరాటపర్వం దాకా..
తెలుగు చిత్రసీమలో చిరకాలం గుర్తుండిపోయే నటుల్లో అలనాటి సావిత్రి ఒకరు. ఆమె జీవితం ఆధారంగా 2018లో 'మహానటి' తెరకెక్కింది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించిన కీర్తి సురేష్‌కే కాదు.. ఆనాటి మధుర దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ఈతరం ప్రేక్షకులకు చూపించిన కెమెరామెన్ డానీకీ ప్రశంసలు దక్కాయి. ఐదు భాషలు అలవోకగా మాట్లాడగలిగే డానీ సాంచెజ్ లోపెజ్ది స్పెయిన్. సినిమాటోగ్రఫీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పలు విశ్వవిద్యాలయాల్లో విజువల్ ఆర్ట్స్ గురించి చదువుకోవడమే కాదు.. పాఠాలు నేర్పారు. 2014లో హిందీ చిత్రం 'తమాన్చే', 2018లో 'ఇష్కిరియా'కు పనిచేశారు. 'మహానటి'తో తెలుగు తెరకు పరిచయమై మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి, సాయిపల్లవి కలయికలో.. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'విరాటపర్వం'కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 1990లో తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, కోలో కోలో.. పాటలోని విజువల్స్ డానీ పనితనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ముందు ఈ చిత్రానికి తెలుగు సినిమాటోగ్రాఫర్ జయకృష్ణా గుమ్మాడి పనిచేశారు. తర్వాత డేట్స్ సర్దుబాటుకాక, డానీ, ఆయన స్థానంలో ప్రవేశించారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్- ప్రభాస్ కలయికలో రూపొందనున్న చిత్రానికి డానీనే సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టనున్నారు.
పోలెండ్ మిరోస్లా.. ఇక్కడ క్యూబా
2005లో 'పిట్బుల్' అనే టీ.వీ సిరీస్‌తో మొదలైంది మిరోస్లా క్యూబా బ్రొజేక్ ప్రస్థానం. అలా 2018 వరకూ వరుసగా పోలెండ్ దేశంలో టీ.వీ సిరీస్‌తో పాటు మ్యూజిక్ వీడియోస్‌కు దర్శకత్వం వహించారాయన. ఆ రెండు విభాగాల్లోనే కాకుండా కెమెరా, నటుడు, రచయిత, ఎడిటర్ గానూ గుర్తింపు పొందారాయన. పొలిష్ భాషలో విడుదలైన 'బోటాక్స్' (టీవీ సీరిస్), 'ఉమెన్ ఆఫ్ మాఫియా-2', 'ది ప్లేగ్ ఆఫ్ బ్రెస్లా' చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 2019లో నాని 'గ్యాంగ్‌లీడర్'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మిరోస్లా అన్న పేరు కాస్త తెలుగు గడ్డకు పరిచమయ్యాక 'క్యూబా'గా మారింది. ప్రస్తుతం ఈ క్యూబా అల్లు అర్జున్- సుకుమార్ కలయికలో రానున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'తో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పుష్ప పరిచయ టీజర్లో విజువల్స్‌కు అల్లుఅర్జున్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో 'వైల్డ్ డాగ్'