తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీకాంత్​కు విలన్​గా గోపీచంద్..! - Gopichand Turns Villion

సూపర్​స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర గోపీచంద్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

రజనీకాంత్
రజనీకాంత్

By

Published : Mar 5, 2020, 8:43 PM IST

కెరీర్‌ ఆరంభంలో ప్రతినాయక పాత్రల్లో కనిపించిన గోపీచంద్‌ మరోసారి విలన్‌ అవతారమెత్తనున్నాడని టాక్‌. అది కూడా ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్‌ చిత్రంలో. రజనీ హీరోగా దర్శకుడు శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కథానాయకుడితో పోటీపడే పాత్ర కోసం గోపీచంద్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడట శివ.

గతంలో గోపీచంద్‌ హీరోగా 'శౌర్యం', 'శంఖం' చిత్రాలకు దర్శకత్వం వహించాడు శివ. దాంతో అతడు కథ చెప్పగానే గోపీ ఓకే చేశాడని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గోపీచంద్‌ 'సీటీమార్‌' చిత్రంలో నటిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. ఇవి పూర్తయ్యాక రజనీ చిత్రంలో నటిస్తాడా? అంటే వేచి చూడాల్సిందే.

ఈ చిత్రానికి 'అన్నాత' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. రజనీ సరసన మీనా, కీర్తి సురేశ్, ఖుష్బూ కనువిందు చేయబోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details