'బాహుబలి'... తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ జాబితాలో హాలీవుడ్ దర్శకుడు స్కాట్ డెరిక్సన్ చేరాడు.
రెండో భాగంలోని క్లైమాక్స్‌లో ప్రభాస్, సత్యరాజ్‌తో పాటు మరికొందరు సైనికులు చెట్టుపై నుంచి ఎగిరిపడే సన్నివేశం గుర్తుందా? అది సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇలాంటి సీన్ తానెప్పుడూ చూడలేదంటూ కార్లోస్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో పంచుకున్నాడు. ఆ వీడియోను షేర్ చేశాడీ డైరక్టర్.