ప్రధాని నరేంద్ర మోదీ, ఈరోజు(శుక్రవారం) ఉదయం ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు ఐక్యత చూపాలని అందులో చెప్పారు. దీనికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతు తెలిపారు. ఈ నెల 5న రాత్రి 9 గంటలకు విద్యుద్దీపాలు ఆపేసి.. కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించే కార్యక్రమంలో భాగమవుతామని అన్నారు.
"ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు లైట్లను ఆపేయండి. 9 నిమిషాల పాటు కేవలం కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లను ఉపయోగించండి. చీకటిని జయించి, కరోనాపై పోరాటం చేయండి"
- అర్జున్ కపూర్, బాలీవుడ్ నటుడు
"మోదీ విజ్ఞప్తి మేరకు ఈ ఆదివారం మరోసారి అందరం ఐక్యతను చాటుదాం. ప్రతి ఒక్కరూ రాత్రి 9 గంటలకు లైట్లను ఆపేసి.. కేవలం కొవ్వొత్తులు, స్పార్క్ లైట్లతో కరోనాను జయిద్దాం"
- భూమి పెడ్నేకర్, బాలీవుడ్ నటి