తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2021, 8:54 AM IST

ETV Bharat / sitara

జైలు నుంచి విడుదలైన మునావర్​ ఫరూకీ

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలతో.. జైలుకు వెళ్లిన స్టాండప్​ కమెడియన్​ మునావర్​ ఫరూకీ శనివారం రాత్రి విడుదలయ్యారు. ఈ నెల 5న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్​ మంజూరు చేసిన నేపథ్యంలో మునావర్​ను రిలీజ్​ చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

Comedian Munawar Faruqui released from Indore Central Jail
జైలు నుంచి విడుదలైన స్టాండప్​ కమెడియన్​

మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన కేసులో ఈ ఏడాది జనవరి 1న అరెస్టైన స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫరూకీ.. జైలు నుంచి విడుదలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ ‌జైలులో ఉన్న మునావర్‌కు ఈ నెల 5న సుప్రీంకోర్టు బెయిల్ ‌మంజూరు చేసింది. దీంతో శనివారం అర్ధరాత్రి తర్వాత జైలు నుంచి ఆయన రిలీజ్​ అయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా మునావర్​ను జైలు వెనుక నుంచి పంపినట్లు తెలుస్తోంది.

మునావర్‌ విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇందోర్ జైలు వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే కేసులో మునావర్ ‌ఫిబ్రవరి 18న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరుకానున్నారు.

ఇదీ చూడండి:ఇన్​స్టాగ్రామ్​లో సమంత సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details