తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2021, 7:40 AM IST

ETV Bharat / sitara

నాని 'వి' సినిమాపై పరువు నష్టం కేసు

తన ఫొటోను అనుమతి లేకుండా ఉపయోగించడంపై సాక్షి మాలిక్, 'వి' సినిమాపై కేసు పెట్టింది. తక్షణమే ఆమె ఫొటోలు ఉన్న సీన్లను తొలగించాలని కోర్టు ఆదేశించింది.

Bombay HC orders Amazon Prime to take down V for illicit use of Sakshi Malik's image
నాని 'వి' సినిమాపై పరువు నష్టం కేసు

నాని 'వి' సినిమా విషయమై మోడల్​ సాక్షి మాలిక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అనుమతి లేకుండా తన ఫొటోను ఉపయోగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ చిత్రం గతేడాది సెప్టెంబరులో అమెజాన్​ ప్రైమ్​లో నేరుగా విడుదలైంది.

అసలేం జరిగింది?

ఈ సినిమాలో మొబైల్ ఫోన్​లో సెక్స్​ వర్కర్​ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఒకటి ఉంది. అందులో తన​ ఫొటోను ఉపయోగించారని చెప్పిన సాక్షి మాలిక్, 'వి' చిత్రంపై పరువు నష్టం దావా వేసింది. స్పందించిన న్యాయస్థానం, సదరు సీన్ తొలగించాలని ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ను ఆదేశించింది.

వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఫొటోలను వినియోగించడం చట్ట విరుద్ధమని, అలా చేస్తే పరువు నష్టం కిందకే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తక్షణమే ఆమె ఉన్న సన్నివేశాలు తొలగించాలని స్పష్టం చేసింది. దానిని డిలీట్​ చేసిన తర్వాత సాక్షికి చూపించి, సినిమాను ఓటీటీలో అప్​లోడ్​ చేయాలని చెప్పింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details