నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో బాలీవుడ్ నటులు ఓటు వేసి ప్రజాస్వామ్యం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
ఓటు కోసం క్యూ కట్టిన బాలీవుడ్...
బాలీవుడ్ తారలు ముంబయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, భార్య జయాబచ్చన్, తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌తో కలిసి ఓటును వినియోగించుకున్నారు. అజయ్ దేవ్‌గణ్-కాజోల్ , ఆమిర్ ఖాన్-కిరణ్ రావు ఓటు వేశారు. బాలీవుడ్ ఎవర్గ్రీన్ నటి హేమమాలిని, ఇమ్రాన్ హష్మీ, గాయకుడు ఖైలాష్ ఖేర్, సీనియర్ నటి మాధురీ దీక్షిత్, సోనాలి బింద్రే, ఊర్మిలా మతోండ్కర్ ఓటు వేశారు.
సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, వరుణ్ ధావన్, అనుపమ్ ఖేర్, శంకర్ మహదేవన్, ప్రియాంక చోప్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారి చేతి ఇంక్ మార్క్‌ను చూపుతూ అందరూ ఓటు వేయాలని ట్వీట్ చేశారు.