ఏడాదిన్నర కిందట వరకు వరుస పరాజయాలతో సతమతమైన సాయితేజ్.. 'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో విజయాల బాటలోకి వచ్చాడు. ప్రస్తుతం అతడు నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం విడుదలయ్యేందుకు ముస్తాబవుతుండగా.. దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా చిత్రీకరణ ముగియక ముందే తేజు కోసం నిర్మాతల పోటీ మొదలైనట్లు తెలుస్తోంది.
'ప్రతిరోజూ పండగే' చిత్రంతో వసూళ్ల పరంగానూ తన మార్కెట్‌ను పెంచుకున్న తేజ్.. ఇప్పుడు మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలకు మంచి ఆప్షన్‌గా మారాడు. అందుకే బీవీఎస్ఎన్ ప్రసాద్, దిల్‌రాజు, వైష్ణో కృష్ణ వంటి అగ్ర నిర్మాతలందరూ ఈ మెగా హీరోతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.