తొలుత సహాయ పాత్రల్లో మెరిసి, అనంతరం నిర్మాతగా మారిన బండ్ల గణేశ్.. చాలా కాలం తర్వాత మళ్లీ నటుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు'లో ఓ కోటీశ్వరుడైన అమాయకుడి పాత్రలో సందడి చేయనున్నాడని సమాచారం.
ఇటీవలే కశ్మీర్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ట్రైన్ సెట్లో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఆ ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.