ప్రాణాంతక కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కరచాలనంకు బదులు ప్రముఖుల నుంచి సాధారణ సెలబ్రిటీల వరకు అందరూ నమస్తే పెడుతున్నారు. ఇప్పుడు దీనిపై ఓ పాట రూపొందించాడు ప్రముఖ సింగర్, ర్యాపర్ బాబా సెహగాల్. 'నమస్తే' పేరుతో తీసిన ఆ గీతాన్ని తాజాగా విడుదల చేశాడు.
"కరోనా చాలా సున్నితమైన విషయం. ముందు దీనిపై పాట తీయకుడదని అనుకున్నా. కానీ ప్రిన్స్ చార్లెస్ నమస్తే పెట్టడం చూసి నిర్ణయం మార్చుకున్నా. మన సంప్రదాయానికి వచ్చిన గౌరవం చూసి నాకెంతో ఆనందం అనిపించింది. అందుకే వైరస్ నివారణ చర్యలను వివరిస్తూ ఓ పాట రూపొందించాను"
-బాబా సెహగల్, గాయకుడు