తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2020, 9:55 PM IST

ETV Bharat / sitara

కన్నడ 'శివప్ప' చిత్రంలో అంజలి

దక్షిణాదిన వరుస సినిమాలతో జోరుచూపిస్తోంది నటి అంజలి. బాలకృష్ణ, పవన్​కల్యాణ్​ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా మరో ఆఫర్​ కొట్టేసింది. కన్నడలోని 'శివప్ప' అనే చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనువిందు చేయనుంది.

anjali news
కన్నడ 'శివప్ప' చిత్రంలో అంజలి

'జర్నీ','సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు','డిక్టేటర్'‌,'బలుపు' లాంటి చిత్రాలతో అలరించిన తెలుగింటి అమ్మాయి అంజలి. దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లోనూ అలరించింది. తాజాగా ఈ అమ్మడుకు మరో ఆఫర్​ వచ్చింది. కన్నడలో శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'శివప్ప' చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. ఇందులో శివరాజ్‌ కుమార్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. పృథ్వీ అంబార్‌, ధనంజయ్, శశి కుమార్‌, సినీయర్ నటి ఉమాశ్రీ కనువిందు చేయనుంది. ఈనెల 23వ తేదీన చిత్రీకరణ ప్రారంభం కానుంది.

యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్‌ సీలిన్‌ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం అంజలి తెలుగులో 'ఆనందభైరవి', పవన్‌కల్యాణ్‌ సరసన 'వకీల్‌సాబ్'‌ చిత్రాల్లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details