తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema Tickets Issue AP : సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Cinema Tickets Issue AP : ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ముందుంచాలని.. ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఏపీ హైకోర్టు, AP high court
ఏపీ హైకోర్టు

By

Published : Dec 16, 2021, 1:05 PM IST

Cinema Tickets Issue AP : ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమానులు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ముందుంచాలని ఆదేశించింది. ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

AP high court on cinema tickets : మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలుగా వర్గీకరించి సినిమా టికెట్‌ ధరలను నిర్ణయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 8న హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ జీవో 35ను జారీచేశారు. దాన్ని సవాలు చేస్తూ తెనాలికి చెందిన లక్ష్మి శ్రీలక్ష్మి సినిమా థియేటర్‌ మేనేజరు వాసుదేవరావుతో పాటు పలు థియేటర్ల యాజమాన్యాల తరఫున న్యాయవాది వీవీ సతీష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టి.. జీవో 35ను రద్దు చేసింది. జీవో 35కు ముందు అనుసరించిన విధానంలో టికెట్‌ ధరలను నిర్ణయించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలకు/ పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. ధరల నిర్ణయం సమాచారాన్ని లైసెన్సింగ్‌ అథార్టీ అయిన సంయుక్త కలెక్టర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. జీవో 35 గతంలో హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పులకు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది.

Cinema Tickets Price Issue AP : మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలుగా ప్రాంతాలవారీగా వర్గీకరించి సినిమా టికెట్‌ ధరలను నిర్ణయించడానికి వీల్లేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా జీవో 35 ఉందని పేర్కొంది. మరోవైపు ధరలపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన కమిటీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వం వహించాలని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని గుర్తుచేసింది. అందుకు భిన్నంగా ఆయనను సభ్యునిగానే పేర్కొన్నారని ఆక్షేపించింది. సింగిల్‌ జడ్జి తీర్పుపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. థియేటర్ యాజమాన్యాలు వచ్చినట్లు టికెట్ ధరలను నిర్ణయించుకునే ప్రమాదం ఉందని అప్పీల్లో పేర్కొన్నారు . సామాన్యుడిపై భారం పడుతుందన్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం థియేటర్ల యజమానులు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ముందుంచాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details