తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పిచ్చోడికి ప్రేమికురాలిగా అమైరా దస్తర్​ - రాజ్​కుమార్

బాలీవుడ్​ నటి అమైరా దస్తర్​ నటించిన తాజా చిత్రం 'మెంటల్​ హై క్యా'. ఈ సినిమాలో హీరో రాజ్​కుమార్​ రావ్​కు ప్రేమికురాలిగా సందడి చేయనుంది. జూలై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ థ్రిల్లర్​ చిత్రంలో... తన పాత్ర గురించి చిన్న క్లూ ఇచ్చింది అమైరా.

పిచ్చోడికి ప్రేమికురాలిగా అమైరా దస్తర్​

By

Published : Jun 24, 2019, 5:42 PM IST

అమైరా దస్తర్​.. చూడటానికి అచ్చమైన సిటీ అమ్మాయిలా ఉండి మోడ్రన్​ దుస్తుల్లో అలరించే ఈ అమ్మడు... మెంటల్​ హై క్యా చిత్రంలో రాజ్​కుమార్​ సరసన నటించింది. ఈ సినిమాలో అమైరాను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు రాజ్​కుమార్​. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ వంట సీనుల్లో చాలా ఇబ్బంది పడిన విషయం గుర్తు చేసుకుందీ భామ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లతో రాజ్​కుమార్​, కంగనా పాత్రలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా అమైరా నటన ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

నటి అమైరా దస్తర్​

వంటగది నా శత్రువు...

'మైంటల్​ హై క్యా' చిత్రంలో తన పాత్ర కోసం చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది అమైరా. జీవితంలో ఒక్కసారి గరిటె పట్టుకోకపోయినా... ఈ చిత్రంలో అన్నీ నేర్చుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఈ సినిమాలో వంట సీన్లలో బాగా నటించేందుకు లండన్​లో ప్రముఖ చెఫ్​ అయిన తన తమ్ముడిని.. ముంబయికి పిలుపించుకొని మరీ పాఠాలు చెప్పించుకొందట అమైరా.

" నిజానికి మా ఇంట్లో నేను వంటగదిలోకి వెళ్లను. స్టవ్​ వెలిగించడం కూడా రాదు. మా ఇంట్లో అమ్మ, తమ్ముడే వంట చేస్తారు. నాకు అదొక పెద్ద శత్రువు అందుకే ఒక్కసారి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు. అయితే ఈ సినిమాలో పాత్ర కోసం నా తమ్ముడి దగ్గర కుకింగ్​ నేర్చుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది. వంట రుచికరంగా తయారు చేయడం చాలా కష్టమైన పని. ఈ సినిమా ముందు వరకు చిన్న కప్ ​కేకు చేయడం కూడా రాని నేను... ఇప్పుడు నా చేతి వంటతో ఎవరైనా వావ్​ అనిపించుకొనేలా నేర్చుకున్నాను"
-- అమైరా దస్తర్​, నటి

ఏక్తాకపూర్‌ నిర్మాతగా, ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో ‘ఈ చిత్రం రానుంది. కంగనారనౌత్‌, రాజ్‌కుమార్‌ రావ్‌, జిమ్మిషెర్గిల్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు. జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో పాటు 'మేడ్​ ఇన్​ ఇండియా', 'ప్రశాంతం', 'కోయీ జానే నా' చిత్రాలతో బిజీగా ఉంది అమైరా.

ABOUT THE AUTHOR

...view details