అగ్రకథానాయకుల చిత్రాల మధ్య పోటీ ఎప్పుడైనా ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది పండుగ సీజన్‌లో అయితే మరింత హంగామా ఉంటుంది. వచ్చే ఏడాది క్రిస్మస్‌కు బాలీవుడ్‌లో అలాంటి సందడే కనిపించబోతోంది. స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ బాక్సాఫీసు వద్ద తలపడనుండటం విశేషం.
ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'లాల్ సింగ్ చద్ధా'. పాతికేళ్ల క్రితం హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ ప్రధాన పాత్రలో నటించిన 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి ఇది రీమేక్. 'సీక్రెట్ సూపర్‌స్టార్' దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తాజాగా ఆమీర్ ప్రకటించారు.