బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రధానపాత్రలో నటించిన 'తాండవ్' మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న ఆరోపణలతో ఇటీవలే వివాదంలో చిక్కుకుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమవుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను నిలిపివేయాలంటూ నిరసనలు వెల్లువెత్తడం సహా దర్శకనిర్మాతలు, నటులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వెబ్‌సిరీస్ వల్ల మనోభావాలు దెబ్బతిన్నవాళ్లకు ఓ సారి క్షమాపణలు చెప్పిన అమెజాన్ ప్రైమ్ మరోసారి క్షమాపణలు చెప్పింది. అంతేకాదు.. ఆ వెబ్‌సిరీస్‌లో వివాదాస్పద సన్నివేశాలను తొలగించేసినట్లు వెల్లడించింది. వీక్షకుల మనోభావాల్ని తాము గౌరవిస్తామని తెలిపింది.
ఇటీవల ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్.. సిరీస్ ద్వారా మనోభావాలు దెబ్బతిన్న వాళ్లకు క్షమాపణలు తెలియజేశారు. వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.