దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈరోజు అజయ్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌తో కూడిన లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
'ఆర్ఆర్ఆర్' నుంచి అజయ్ దేవగణ్ లుక్ రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, తారక్ హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఈ సినిమాలోని అజయ్ దేవగణ్ పాత్ర లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
అజయ్ దేవగణ్
ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల కానుందీ సినిమా. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.