దక్షిణాది సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. ప్రభాస్ 'ఛత్రపతి' రీమేక్.. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ జాబితాలోకి జూ.ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' కూడా చేరనుందని తెలుస్తోంది. ప్రముఖ హిందీ నిర్మాత ఎస్.తౌరనీ.. దీనిని రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.
'ఊసరవెల్లి' స్క్రిప్ట్‌ను బాలీవుడ్‌కు తగ్గట్లుగా పలు మార్పులు చేస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందట.
2011 దసరాకు వచ్చిన 'ఊసరవెల్లి'లో తారక్-తమన్నా జంటగా నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. రూ.57 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. కొన్నేళ్ల క్రితం బెంగాలీలో 'రాకీ' పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు. మహాక్షయ్, పూజా బోస్ హీరోహీరోయిన్లుగా చేశారు.