నటి, మోడల్ మీరా మిథున్.. కోలీవుడ్ నటులపై చేస్తున్న విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే హీరోయిన్ త్రిషపై తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన మీరా.. తాజాగా తమిళ అగ్రనటులు విజయ్, సూర్యను విమర్శించింది. విజయ్ నటించిన 'బిగిల్' సినిమా పెద్ద ఫ్లాప్ అని.. తన తండ్రి వల్లే అతడు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాడని విమర్శించింది. 'థానా సెర్నధ కొట్టమ్' చిత్రంతో తన పేరు వార్తల్లో నిలవడం వల్ల సూర్య చాలా అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నాడని చెప్పింది. సూర్య అసలు గొప్ప నటుడే కాదంది మీరా.
సూర్యతో పాటు జ్యోతికపైనా విరుచుకుపడింది మీరా. ఇండస్ట్రీలో జ్యోతికకు ఎన్నో చీకటి రహస్యాలున్నాయని.. సూర్యతో పెళ్లి జరిగిన వెంటనే ప్రజలు ఆమెను పవిత్రంగా చూస్తున్నారని చెప్పింది.
దీంతో విజయ్, సూర్య అభిమానులు ఈ బిగ్బాస్ భామపై మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారు.