వరుసగా పెద్దపెద్ద సినిమాల్లో నటిస్తూ.. కెరిర్లో దూసుకుపోతున్న యాంకర్, నటి అనసూయ.. ఎప్పటికప్పుడు నెటిజన్ల నోళ్లలో నానుతుంటారు. వేసే డ్రెస్సుల దగ్గరి నుంచి తాను చేసే సిినిమాల వరకు తనకు సంబంధించిన విషయాలన్ని సోషల్ మీడియాలో వివాదంగా మారుతుంటాయి. తాను చేసే పనులతో ప్రతీసారి ట్రోలర్స్, మీమర్స్‌కు పనిచేప్తూంటారు. కాగా.. ప్రస్తుతం ఉమెన్స్ డే సందర్భంగా ఆమె చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. హ్యాపీ ఫూల్స్ డే అంటూ.. ట్వీట్ చేసి నెటిజన్లకు మరోసారి పని చెప్పింది.
ఉమెన్స్ డే సందర్భంగా అనసూయ.. ట్విట్టర్ వేదికగా మీమర్స్, ట్రోలర్స్‌పై వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. ఒక్కసారిగా మీమ్ మేకర్స్, ట్రోలర్స్‌కు ఆడవాళ్ల మీద అపారమైన గౌరవం పొంగుకొస్తుంటుంది. అది కూడా ఒక్కరోజులో మళ్లీ మాయపోతుందంటూ.. తనదైన శైలితో చురకలంటించింది. దానికి తోడు.. చివరలో హ్యాపీ ఫూల్స్ డే అంటూ విష్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన నెటిజన్లు అనసూయపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.