ఒలింపిక్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా బయోపిక్‌పై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతానికి ఈ సినిమాను పక్కన పెట్టినట్లు దర్శకుడు హీరజ్ మర్తాఫియా చెప్పారు. అయితే నిర్మాతలు మాత్రం దీనిని తిరిగి మొదలపెట్టాలనుకోవట్లేదని సమాచారం.
కష్టాల్లో ఒలింపిక్ విజేత బింద్రా బయోపిక్! - movie latest news
ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా బయోపిక్ పూర్తిగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?

కష్టాల్లో ఒలింపిక విజేత బింద్రా బయోపిక్!
మూడేళ్ల క్రితం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అయితే నటీనటులను ఎంపిక చేయడంలో ఆలస్యమైంది. రిషి కపూర్‌ను అభినవ్ బింద్రా తండ్రి పాత్రకు ఎంచుకున్నారు. వరుణ్ ధావన్‌ను టైటిల్ రోల్ కోసం తీసుకున్నారు.
అయితే అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ సీన్లోకి వచ్చారు. గతేడాది ఎట్టకేలకు షూటింగ్ మొదలుపెట్టాలనుకున్నారు. కానీ కరోనా లాక్డౌన్ దానిని అడ్డుకుంది. దీంతో సినిమాను కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రారంభించాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Last Updated : Feb 6, 2021, 9:10 PM IST