తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వెబ్‌ వాట్సాప్‌లో కాల్‌ హిస్టరీ.. ఎలా చూడచ్చో తెలుసా?

వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్​ అందుబాటులోకి రానుంది. కొద్దిరోజుల క్రితం డెస్క్‌టాప్‌ యాప్‌లో స్క్రీన్‌ లాక్‌ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీంతో మొబైల్‌ యాప్‌లో మాదిరి యూజర్లు ఇకపై డెస్క్‌టాప్‌లో కూడా వాట్సాప్ కాల్ హిస్టరీని యాక్సెస్‌ చేయొచ్చు.

స్క్రీన్‌ లాక్‌ పేరుతో ప్రైవసీ ఫీచర్‌
వాట్సాప్

By

Published : Nov 26, 2022, 8:26 AM IST

మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ వరుసగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ.. యూజర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కొద్దిరోజులుగా కమ్యూనిటీస్, కాల్‌ లింక్‌, గ్రూప్‌ లిమిట్‌ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. కేవలం మొబైల్‌ యాప్‌లోనే కాకుండా, డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కూడా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను పరిచయం చేయనుంది. ఇటీవలే డెస్క్‌టాప్‌ యాప్‌ కోసం స్క్రీన్‌ లాక్‌ పేరుతో ప్రైవసీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీంతో మొబైల్‌ యాప్‌లో మాదిరి యూజర్లు ఇకపై డెస్క్‌టాప్‌లో కూడా వాట్సాప్ కాల్ హిస్టరీని యాక్సెస్‌ చేయొచ్చు. ప్రస్తుతం విండోస్‌ 2.2246.4.0 వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకొని బీటా యూజర్లు ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చు. త్వరలోనే సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది.

గత నెలలో వెబ్‌ వాట్సాప్ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను కొత్త లుక్‌లోకి మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా చాట్ లిస్ట్ ఎడమ వైపున సైడ్‌బార్‌ కనిపిస్తుంది. అందులో పైన చాట్స్‌ లిస్ట్‌ ఐకాన్‌, స్టేటస్‌ ఐకాన్‌ ఉంటాయి. దిగువన సెట్టింగ్స్‌, ప్రొఫైల్‌, ఫీడ్‌బ్యాక్‌ ఆప్షన్లు ఉంటాయి. కొత్తగా తీసుకొస్తున్న కాల్స్‌ ఫీచర్‌ పైన ఉన్న చాట్స్‌ లిస్ట్‌, స్టేటస్‌ మధ్యలో ఉంటుందని సమాచారం. ఇప్పటికే కొత్త యూఐ ఐఓఎస్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే సాధారణ యూజర్లకు సైతం అప్‌డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details