మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తే చాలు.. కెమెరా క్వాలిటీ గురించి చాలా మంది చెక్ చేసేస్తారు! రేర్ కెమెరా, సెల్ఫీ కెమెరా ఎన్ని మెగాపిక్సెల్స్ ఉన్నాయి? అని చూసుకున్న తర్వాతే ఆ ఫోన్ ర్యామ్ వంటి వివరాల్లోకి వెళతారు. ప్రస్తుతం ఫోన్ కెమెరాకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మొబైల్ కంపెనీలు ప్రతి మోడల్‌కు కెమెరా క్వాలిటీని పెంచుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే శామ్సంగ్, షియోమీ వంటి సంస్థలు అత్యధికంగా 108 మెగాపిక్సెల్స్ కలిగిన స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు ఇదే బాటను ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ మోటోరోలా అనుసరిస్తున్నట్టు కనపడుతోంది.
మోటోరోలా ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ప్రో వేరియంట్లు.. చైనా విపణిలోకి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 5వ తేదీన ఎడ్జ్ 20 సిరీస్‌ను చైనాలో రిలీజ్ చేయనున్నట్టు మోటోరోలా సంస్థ ప్రకటన చేసింది. 108 పిక్సెల్స్ కెమెరాతో ఈ స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 20 రిలీజ్ ప్రకటన ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు కొన్ని లీక్ అయ్యాయి. అవేంటో చూసేద్దాం..
ఫీచర్లు..
మోటోరోలా ఎడ్జ్ 20:
- 108 మెగాపిక్సెల్ + 16 మెగాపిక్సెల్ (ఆల్ట్రావైడ్) + 8 మెగాపిక్సెల్ (5x ఆప్టికల్ జూమ్) రేర్ కెమెరా;
- సెల్ఫీ కెమెరా - ఎడ్జ్ 20 (32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా + 16 మెగా పిక్సెల్ సెల్ఫీ స్నాపర్)
- 6.67 ఇన్చెస్ ఎఫ్‌హెచ్‌డీ + ఓఎల్ఈడీ డిస్ప్లే(120 హెట్జ్ రిఫ్రెష్ రేట్)
- స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్
- 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 11 ఓస్
- 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- ఫాస్ట్ ఛార్జింగ్
- ఫింగర్ ప్రింట్ లాక్
- గూగుల్ అసిస్టెంట్ బటన్
మోటోరోలో ఎడ్జ్ 20 ప్రో:
- 108 మెగాపిక్సెల్ + 16 మెగాపిక్సెల్ (ఆల్ట్రావైడ్) + 8 మెగాపిక్సెల్ (3x ఆప్టికల్ జూమ్ ఫర్ ఎడ్జ్ 20 ప్రో) రేర్ కెమెరా;
- 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా + 16 మెగా పిక్సెల్ సెల్ఫీ స్నాపర్
- 6.67 ఇన్చెస్ ఎఫ్‌హెచ్‌డీ + ఓఎల్ఈడీ డిస్ప్లే(120 హెట్జ్ రిఫ్రెష్ రేట్)
- స్నాప్‌డ్రాగన్ 870 చిప్ ప్రాసెసర్
- 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 11 ఓస్
- 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- ఫాస్ట్ ఛార్జింగ్
- ఫింగర్ ప్రింట్ లాక్
- గూగుల్ అసిస్టెంట్ బటన్
ఈ స్మార్ట్ ఫోన్ల వేరియంట్ల ధరలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. దీనిపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.
అయితే.. చైనా తర్వాత త్వరలోనే ఈ ఫోన్‌ను భారత విపణిలోకి సంస్థ ప్రవేశపెట్టనుందని టెక్ వర్గాల సమాచారం.
ఇదీ చూడండి..శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ.. ఫీచర్స్ లీక్!