తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫోన్​ స్టోరేజ్ నిండిపోయిందా?.. ఈ సింపుల్​ టిప్స్​తో క్లియర్ చేసేయండిలా! - మొబైల్​ ఫోన్లలో స్టోరీజీని క్లీయర్​ చేయడం ఎలా

How To Clear Phone Storage : మనం ఫోన్ వాడేటప్పుడు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. కానీ అందులో వచ్చే ఒక్క నోటిఫికేషన్ మాత్రం మనకు చిరాకు తెప్పిస్తుంటుంది. అదే డివైజ్ స్టోరేజీ ఫుల్ అయిందని. స్టోరేజీ ఫుల్ అవటం వల్ల కొన్ని పనులకు ఆటంకం కలగడంతో పాటు పలు ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో నిండిపోయిన స్టోరేజీని ఇలా చేయడం వల్ల సులభంగా క్లియర్ చేయవచ్చు.

How To Clear Phone Storage
How To Clear Phone Storage

By

Published : Jul 13, 2023, 5:38 PM IST

How To Free Up Space In Android : మనం ఫోన్​లు వాడేటప్పుడు వచ్చే నోటిఫికేషన్లలో కల్లా స్టోరేజీ ఫుల్ అయిందని వచ్చే నోటిఫికేషన్​.. మనకు ఒకింత కోపం, చికాకు తెప్పిస్తుంది. ఎందుకంటే ఫోన్ ఆపరేట్ చెయ్యాలన్నా.. కొత్తగా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలన్నా, యాప్​లు డౌన్​లోడ్ చేసుకోవాలన్నా.. తగినంత స్పేస్ ఉండాలి. లేకపోతే అవేం చేయలేం. స్టోరేజీ ఫుల్ అవడం వల్ల ఫోన్ పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. పైగా స్టోరేజీ క్లియర్ చేయడానికి కొన్ని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుంది. మరి అలాంటివేవీ చేయకుండా.. దాని నుంచి తప్పించుకోవాలంటే ఈ పనులు చేయాల్సిందే!

అసలు స్టోరేజీ ఎందుకు నిండుతుంది ?
మీరు పాత మోడల్ ఫోన్ వాడితే అందులోని స్టోరేజీ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల నిండుతుంది. మోతాదుకు మించి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, ఎక్కువ పరిమాణం కలిగిన గేమింగ్ యాప్​లు డౌన్​లోడ్ చేసుకోవడం, అవసరానికి డౌన్​లోడ్ చేసుకుని తర్వాత ఉపయోగించని యాప్స్ అలాగే ఉంచుకోవడం తదితరాలు కారణం కావచ్చు. సింపుల్ టెక్నిక్​ తో ఈ చిన్న పనులు చేసి స్టోరేజీ ఖాళీ చేసుకోవచ్చు. అవేంటంటే?

1. యాప్స్ స్టోరేజీ పై దృష్టి పెట్టడం
అవసరాలను బట్టి మన ఫోన్లో బ్రౌజింగ్, జీమెయిల్, సోషల్ మీడియా, ఒకట్రెండు గేమింగ్ యాప్స్ ఉంటాయి. కానీ వాటిల్లో ఏ యాప్ ఎంత స్పేస్ వినియోగించుకుంటుందో చాలా మందికి తెలియదు. ఇది తెలుసుకోవడానికి సెట్టింగ్స్ లోకి సెర్చ్ బార్​లో Storage అని టైప్ చేయండి. తర్వాత Appsపై క్లిక్ చేయండి. అక్కడ పైన కుడివైపున ఉన్న మూడు చుక్కల్ని ప్రెస్ చేసి Sort by Size అనే ఆప్షన్ ఎంచుకుంటే ఏ యాప్ ఎంత సైజుందో తెలుస్తుంది. అందులో అనవసరమైన వాటిని డిలీట్ చేయండి.

2. ఆఫ్​లైన్ కంటెంట్​ను తొలగించడం
How To Clear Storage And Cache On Android : చాలా యాప్స్.. ఇంటర్నెట్ లేనప్పుడు కొంత సమాచారాన్ని చదువుకోవడానికి, వాటిని యాక్సెస్ చేయడానికి వీలుగా ఆఫ్​లైన్​లో కంటెంట్ సేవ్ చేయడానికి మనల్ని అనుమతిస్తాయి. ఉదాహరణకు Spotify, Wynk లాంటి మ్యూజిక్, మరికొన్ని Podcast యాప్​లు Audio Files ను నేరుగా మన ఫోన్లో డౌన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తాయి. ఇలాంటి ఆఫ్​లైన్ కంటెంట్ మన ఫోన్​లో ఎక్కువ స్టోరేజీని ఆక్రమిస్తుంది. దీనికి చెక్ పెట్టాలంటే.. పెద్ద పరిమాణం గల ఫైల్స్ డౌన్ చేసుకోకూడదు. ఆఫ్​లైన్ కంటెంట్​ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. దీనికోసం Settings లోకి వెళ్లి Apps పై ప్రెస్ చేసి See all Apps ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ అన్ని యాప్స్ లిస్టు ఉంటుంది. అందులో ఒక్కో యాప్ ఓపెన్ చేసి Storage & Cache ను సెలెక్ట్ చేసుకుని Clear Cache పై ప్రెస్ చేస్తే సరిపోతుంది.

3. ఫొటోలు, వీడియోలు క్లౌడ్ స్టోర్​కు అప్​లోడ్ చేయడం
మన ఫోన్​లోని కొన్ని ఫొటోలు, వీడియోలు పెద్ద పరిమాణం కలిగి ఉంటాయి. ముఖ్యంగా మన ఫోన్లో తీసిన వీడియోలు అధిక స్టోరేజీని ఆక్రమిస్తాయి. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు గూగుల్ డ్రైవ్ లాంటి క్లౌడ్ స్టోరేజీ యాప్​లోకి అప్​లోడ్ చేయడం ద్వారా స్టోరేజీని కాపాడుకోవచ్చు. పైగా ఇలా చేయడం వల్ల ఏదైనా హార్డ్​వేర్ సమస్యలు వచ్చినప్పుడు మిస్​ కాకుండా ఉంటాయి. దీంతో పాటు చిత్రాలు, వీడియోలను Sd Card, PC, Laptop, Hard Disc లోకి పంపించడం వల్ల స్టోరేజీ మిగులుతుంది.

4. గూగుల్ ఫైల్స్ యాప్, ఆండ్రాయిడ్ స్టోరేజీ మేనేజర్ టూల్ ఉపయోగం
గూగుల్ ఫైల్స్ యాప్ వినియోగించి సులభంగా అనవసర ఫైల్స్ డిలీట్ చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్​లో ఇన్​బిల్ట్ గానే ఇది వస్తుంది. ఇందులో జంక్, లార్జ్, డూప్లికేట్ ఫైల్స్ అన్ని స్పష్టంగా విడివిడిగా ఉంటాయి. కాబట్టి ఒక్క క్లిక్​తో వాటిని తొలగించవచ్చు. ఫోల్డర్లు కేటగిరీలుగా ఉండటం వల్ల వాటి సైజును బట్టి ఫైల్స్​ను సులభంగా డిలీట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మన ఫోన్లో ఉండే ఆండ్రాయిడ్ స్టోరేజీ మేనేజర్ టూల్ ఉపయోగించి పెద్ద పరిమాణం కలిగిన యాప్​లను, వివిధ యాప్​లలో పేరుకుపోయిన కుకీస్​ను డిలీట్ చేయవచ్చు.

ABOUT THE AUTHOR

...view details