How To Check Which Phone Numbers Are Linked To Your Aadhaar :ఒకే ఆధార్ కార్డ్‌పై 650 సిమ్‌కార్డ్‌లు నమోదై ఉన్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అధికారులు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-పవర్డ్ టూల్‌కిట్‌ను ఉపయోగించిన తర్వాత ఈ విషయం వెల్లడైంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన పోలీసులు.. మొత్తం 658 సిమ్ కార్డ్‌లకు ఒకే ఆధార్ కార్డ్‌ను గుర్తింపు పత్రంగా సమర్పించినట్లు తెలుసుకున్నారు. ఈ సిమ్ కార్డులన్నీ సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అనే వ్యక్తి పేరుతో ఉన్నాయని గుర్తించారు. సిమ్ కార్డ్‌లు అమ్ముకునే అతడ్ని.. అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మరో 150 సిమ్ కార్డ్‌లు సైతం తప్పుడు ఆధారాలతో పొందినట్లు గుర్తించారు పోలీసులు.
ASTR(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్) సాంకేతికతను ఉపయోగించి ఈ మోసాన్ని గుర్తించారు అధికారులు. సిమ్ కార్డ్ మోసాలను ఈ ASTR సాఫ్ట్వేర్ పసిగడుతుంది. నకిలీ గుర్తింపు కార్డ్‌లతో తీసుకున్న సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేస్తుంది. ఇది వినియోగదారులు సమర్పించిన గుర్తింపు పత్రాలను టెలికాం ఆపరేటర్ల నుంచి తీసుకుని.. తప్పుడు వివరాలతో ఉన్న సిమ్ కార్డ్‌లను గుర్తిస్తుంది.
ఆధార్‌తో ఎన్ని సిమ్ కార్డ్‌లు నమోదై ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?
How To Know How Many Sim Cards on My Aadhar :దేశంలో ఎన్నో సిమ్ కార్డ్‌లు వేరే వాళ్ల ఆధార్ కార్డ్‌లతో నమోదై ఉన్నాయనే విషయం మీకు తెలుసా? ఇలాంటి సమయంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఆధార్ కార్డ్పైన మరెవరైన సిమ్ కార్డ్‌లు తీసుకున్నారో తెలుసుకోవడం మంచిది. అందుకోసం ఇలా చేయండి.