ఎక్కువమంది తక్కువ ధరకే లభించే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తుంటారు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా ట్రిక్స్ ఉంటాయి. వాటి గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల చాలా మంది వాటిని ఉపయోగించరు. ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా మందికి తెలియని ఐదు అదిరిపోయే ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వన్ హ్యాండెడ్ టైపింగ్
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే జీ-బోర్డ్ కీబోర్డ్‌లో అందుబాటులో ఉండే చిన్న ట్రిక్‌ల వల్ల టైపింగ్ చాలా సులువు అవుతుంది. ఆండ్రాయిడ్ కీబోర్డ్‌లో ఉండే వన్ హ్యాండెడ్ మోడ్ ఫీచర్ వల్ల కీబోర్డ్‌ను మరింత సులువుగా ఉపయోగించుకోవచ్చు. దీని కోసం జీ-బోర్డ్‌లోని వన్ హ్యాండెడ్ టైపింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
- జీ బోర్డ్ ఓపెన్ చేయాలి
- కీబోర్డ్ పైన కనిపించే 3 నిలువు చుక్కలపై క్లిక్ చేయాలి
- ఆ తర్వాత వన్ హ్యాండెండ్ మీద నొక్కాలి
- ఆ తర్వాత.. అక్కడ కనిపించే క్యారెట్ (^) సింబల్‌పై క్లిక్ చేసి మీకు కీబోర్డ్ ఎడమవైపు లేదా కుడివైపు కావాలా అనేది ఎంచుకోవాలి.
- కీబోర్డ్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి స్క్వేర్ షేప్‌లో సూచించే బాణాల గుర్తులపై క్లిక్ చేయాలి.
సెర్చ్ ఫీచర్
ఇక ఆండ్రాయిడ్‌లో లభించే మరో మంచి ఫీచర్.. ఫోన్ ద్వారా ఏదైనా సమాచారాన్ని సేకరించే విధానం. ఈ ట్రిక్ ద్వారా మన ఫోన్‌లోని సందేశాలు, ఫోన్ నెంబర్లు, సెట్టింగ్, ఇతర సమాచారాన్ని సులువుగా పొందవచ్చు. ఇందుకోసం ఈ క్రింది విధంగా చేయాలి.
- హోం స్క్రీన్ మీద స్వైప్ చేయండి.
- పైన కనిపించే సెర్చ్ బార్‌లో మీరు దేనిని శోధించాలనుకుంటున్నారో ఆ విషయం గురించి టైప్ చేయండి.