తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Mental Illness: చిన్నపాటి కారణాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న యువత

చిన్న చిన్నపాటి కారణాలతో యువత ఆసుపత్రుల చుట్టూ తిరుగుతోంది. ఒత్తిడి తట్టుకోలేక... ఏదో ఒకటి చేసేసుకోవాలి ఉందని రోజుకు కనీసం 200 మంది వరకు యువకులు కౌన్సిలింగ్​ వస్తున్నరంటే.. వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.

Mental Illness
Mental Illness

By

Published : Oct 27, 2021, 12:27 PM IST

  • కొత్తగూడెంకు చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమంటూ ఓ అమ్మాయి వెంట తిరిగాడు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 25 ఏళ్లు వచ్చేసరికి వారికి ఇద్దరు పిల్లలు. ఉండటానికి ఇల్లు లేదు. ఆస్తులు లేవు. ఇంట్లో ఖర్చులు బాగా పెరిగాయి. నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నా చాలడం లేదు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పెళ్లికి ముందు నాకేంటి ఎలాగైనా బతకగలననుకున్నాడు. ఇప్పుడు బతకలేననిపిస్తుంది. మనసంతా ఏదో ఆందోళనగా ఉంటుందంటూ ఆ యువకుడు ఇటీవల ఓ వైద్యుడిని కలిసి తన సమస్యను ఏకరవు పెట్టుకున్నాడు.
  • 25 ఏళ్ల యువకుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష చేస్తే తాగినట్టు రుజువైంది. ఇంతలో కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చాడు. ఆ యువకుడిని చూసి మొన్నేకదా పట్టుబడ్డావు. మళ్లీనా అంటే తలదించుకున్నాడు. అమ్మకు ఒంట్లో బాగోలేదు. నాన్న పట్టించుకోడు. చెల్లి, అక్క ఉన్నారు. వాళ్ల బాధ్యతలు కూడా నేనే చూసుకోవాలి. అదంతా తట్టుకోలేక ఇలా అంటూ చెప్పుకొచ్చాడు.
  • ఖమ్మంకు చెందిన 21 ఏళ్ల ఓ యువకుడు ముఖంపై మొటిమలు వస్తున్నాయని చర్మవ్యాధి నిపుణుడు వద్దకు వెళ్లాడు. యవ్వనం కదా అలానే వస్తాయని సదరు వైద్యుడు చెప్పి మందులు రాసి పంపించాడు. అయినా తగ్గలేదు. దీంతో ఇంకో వైద్యురాలు వద్దకు వెళ్లారు. ఈసారి తల్లిని తీసుకొని వెళ్లారు. ఇలా ఏడాది పొడవునా ఆ యువకుడు తిరగని ఆసుపత్రి లేదు.

ఇలా వివిధ రకాల సమస్యలతో వైద్యుల వద్దకు వచ్చే వాళ్లలో యువతే అధికంగా ఉంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం వందల సంఖ్యలో 20-35 ఏళ్లలోపు యువత ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని, ఏదో ఒకటి చేసేసుకోవాలని ఉందని రోజుకు కనీసం 200 మంది వరకు యువకులు కౌన్సెలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారని వ్యక్తిత్వ, మానసిక నిపుణులు చెబుతున్నారు. యుక్త వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటు పడటం, పలు కారణాలతో కుటుంబ బరువు బాధ్యతలు మోయడం వంటి కారణాలతో యువతరం కుంగుబాటుకు, తీవ్ర ఒత్తిడికి గురవుతోందన్నారు. ఇది ఆ కుటుంబానికే కాకుండా సమాజానికే కూడా ఆర్థికంగా, సామాజికంగా, భవిష్యత్తు కోణంలో ఇబ్బందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొందరు యువకులు విలాసాలకు, వ్యసనాలకు అలవాటు పడి బానిసలవుతున్నారు. ఈ క్రమంలో నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకొంటున్నారు. యుక్త వయసు పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచితేనే వారి జీవితం గాడి తప్పకుండా ఉంటుంది.

-డా.సతీష్‌బాబు, మానసిక వైద్య నిపుణులు, ఖమ్మం

ఉమ్మడి జిల్లాలో నమోదైన కేసులు

(జనవరి-సెప్టెంబరు వరకు)

  • మద్యం తాగి పట్టుబడిన వాళ్లు: 2,957
  • కాళ్లు, చేతులు పీకేస్తున్నాయని, ఒళ్లంతా నొప్పులు 3,017
  • గ్యాస్ట్రిక్‌ సమస్య: 3,127
  • ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు: 157
  • గుండెనొప్పి, గుండెల్లో మంట, ఆయాసం : 2,037
  • మొటిమలు: 1,978
  • క్షయ, హెచ్‌ఐవీ, సుఖవ్యాధులు, హెపటైటిస్‌: 2,978

ఇదీ చూడండి:స్టార్స్​కు ఒత్తిడి అనిపిస్తే.. ఈ పనిచేస్తారు!

barefoot walk relieves stress : చెప్పులు విప్పి నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Health Tips: తరుచూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

ABOUT THE AUTHOR

...view details