తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది: సీపీ - Warangal Police Commissionerate లాైే తోూాేూ

కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వరంగల్‌ నగర పోలీస్ కమిషనర్ ప్రమోద్ కూమార్ అన్నారు. నేరాలను నియంత్రించడంలో పోలీసులు విజయం సాధించారని పేర్కొన్నారు.

Warangal Police Commissionerate Annual Report
నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది: నగర పోలీస్ కమిషనర్

By

Published : Dec 29, 2020, 7:56 PM IST

వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వరంగల్‌ నగర పోలీస్ కమిషనర్ ప్రమోద్ కూమార్ తెలిపారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను ఆయన ప్రకటించారు. నేరాలను నియంత్రించడంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు.

ఆ నేరాలు చాలా తగ్గాయి..

గత ఏడాది కన్నా ప్రస్తుత సంవత్సరంలో నేరాలు సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇందులో హత్యలు 23.81 శాతం కాగా, దోపిడీలు 42.86 శాతం, దొంగతనాలు 21శాతం, మోసాలు 30శాతం తగ్గాయని పేర్కొన్నారు. మహిళలపై దాడుల 26 శాతానికి తగ్గించడంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు విజయం సాధించారని పేర్కొన్నారు.

వాటి పట్ల యువత జాగ్రత్త..

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసులు ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవడంతో గతేడాది 1,050 రోడ్డు ప్రమాద సంభవించగా.. ప్రస్తుత సంవత్సరంలో కేవలం 850 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. మనీ ఆప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువంటివాటి గురించి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువత ఆన్‌ లైన్ గేమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గొర్రెకుంట కేసును పరిష్కరించి.. నేరస్థునికి శిక్ష పడేలా చేశామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కొత్త సంవత్సర వేడుకలను గుంపులుగా, బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవద్దని దానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ యూటర్న్

ABOUT THE AUTHOR

...view details