కరోనా వైరస్ నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో యాంటీవైరల్ మాత్రలను మార్కెట్లో అధిక రేట్లకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 లక్షల 60వేల రూపాయలు, విలువైన యాంటీవైరల్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
చిలకలగూడ రామ్‌గోపాల్‌పేట ప్రాంతాలలో పోలీసులు సోదాలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడకు చెందిన సోను అగర్వాల్, రాంగోపాల్‌పేట్ ప్రాంతాలకు చెందిన సునీల్ అగర్వాల్ ఇద్దరూ మెడికల్‌షాప్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితిని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో పక్క దారి పట్టి మాత్రలను బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు మాత్రలను తీసుకుంటున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక లాభాలను పొందేందుకు మాత్రలను పెద్ద ఎత్తున అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మార్కెట్లో యాంటీవైరల్ మాత్రల కొరత సృష్టించి వినియోగదారులకు ఎక్కువ మొత్తంలో అమ్మేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి