నిర్మల్ జిల్లాలో అడవి పందుల బారినుంచి పంటను రక్షించుకోవడానికి ఓ రైతు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగ తగిలి ఇద్దరు మృతి చెందారు. 15 రోజుల క్రితం నర్సాపూర్(జి) మండలానికి చెందిన నిమ్మన్న (52) అనే రైతు కరెంటు తీగ తగిలి మృతి చెందాడు. తాజాగా కడెం మండలం పాలరేగడి గ్రామానికి చెందిన గోతెకర్ చందు(40), అడపు గణపతి(60) విద్యుత్ తీగకు బలయ్యారు.
చేనుకు రక్షణగా కరెంట్ తీగలు.. ఇద్దరు మృతి
నిర్మల్ జిల్లాలో పంట చేనులోని విద్యుత్ తీగ తగిలి ఇద్దరు మృతి చెందారు. అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకోవడానికి ఓ రైతు తన పొలంలో విద్యుత్ తీగలను అమర్చాడు. దురదృష్టవశాత్తు ఆ పొలంలో నుంచి ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వారికి కరెంటు తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
విషాదం: విద్యుత్ కంచె తగిలి ఇద్దరు మృతి
వీరివురూ ఆదివారం కడెంలో అంగడికి వెళ్లారు. మంగళవారం రాత్రి దత్తోజిపేట్ గ్రామ శివారులోని వరి చేను మీదుగా ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో వరిచేనుకు రక్షణగా ఉన్న కరెంటు తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:పోలీస్ స్టేషన్లో రియల్ ఫైట్.. కుర్చీలు కర్రలతో ఇరువర్గాల దాడి