సూర్యాపేట జిల్లా మద్దిరాలలో కృష్ణమూర్తి నగల దుకాణానికి ఇద్దరు మహిళలు వచ్చారు. పట్టీలు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వాటిని చోరీ చేశారు. చాకచక్యంగా రూ.2,000 విలువైన వెండి పట్టీలను తస్కరించారు.
నగల దుకాణంలో పట్టపగలే చోరీ - నగలు
నగల దుకాణంలో పట్టపగలే చోరీ జరిగిన ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాలలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పట్టపగలే నగల దుకాణంలో చోరీ
వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు.
ఇదీ చదవండి:యువతి మృతికి కారణమైన గోకార్టింగ్ నిర్వాహకుల అరెస్టు