కొల్లం గంగిరెడ్డి అనుచరులమంటూ ఏపీ తిరుపతిలో కొంతమంది వ్యక్తులు కర్రలు, కత్తులతో హల్ చల్ చేశారు. ఈ నెల 2న రేణిగుంట రోడ్డులోని బాలాజీ టింబర్ డిపోకు తాళాలు వేసిన సదరు వ్యక్తులు... ఈ స్థలం తమది అంటూ డిపో ఖాళీ చేయాలని యజమాని రాముపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి బెదిరింపులతో భయపడిన ఆయన... అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద నున్న సీసీ టీవీ ఫుటేజ్ విజువల్స్ పోలీసులకు సమర్పించాడు. కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు.
గంగిరెడ్డి పేరుతో తిరుపతిలో ఓ ముఠా దౌర్జన్యం
కొల్లం గంగిరెడ్డి అనుచరులమంటూ ఏపీ తిరుపతిలో కొంతమంది వ్యక్తులు కర్రలు, కత్తులతో హల్ చల్ చేశారు. ఈ నెల 2న రేణిగుంట రోడ్డులోని బాలాజీ టింబర్ డిపోకు తాళాలు వేసిన సదరు వ్యక్తులు... ఈ స్థలం తమది అంటూ డిపో ఖాళీ చేయాలని యజమాని రాముపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
గంగిరెడ్డి పేరుతో తిరుపతిలో ఓ ముఠా దౌర్జన్యం
అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి కేసులో నిందితుడు గంగిరెడ్డి – ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో అరెస్టై ఇటీవల విడుదలయ్యారు. అతని అనుచరులంటూ దౌర్జన్యనాలకు పాల్పడటంతో వాళ్ళు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్