సరూర్‌నగర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
09:43 June 25
సరూర్‌నగర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్ సరూర్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలో రౌడీషీటర్ వినయ్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వినయ్‌పై అర్ధరాత్రి కత్తితో దాడి చేశారు. నగదు, సెల్‌ఫోన్ విషయంలో వివాదమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. గౌలిగూడకు చెందిన వినయ్‌పై ఛత్రినాక పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదైనట్టు తెలిపారు. నిందితులు సంతోశ్నగర్కు చెందిన సోదరులు సందీప్, సంతోశ్ కుమార్‌గా గుర్తించారు. వీరు కూడా పాత నేరస్థులుగా పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.