తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దుండిగల్​ ఓఆర్​ఆర్​ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా దుండిగల్​ ఓఆర్​ఆర్​ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

one person died in an accident at orr near dundigal
దుండిగల్​ ఓఆర్​ఆర్​ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

By

Published : Oct 30, 2020, 6:50 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ఓఆర్​ఆర్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం సేవించి అతివేగంగా నడుపుతూ దుండిగల్​ ఓఆర్​ఆర్​ వద్ద మరో వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టారు. ఘటనలో కారులో వెనక కూర్చున్న ప్రవీణ్​ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్​తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన బాహ్యవలయ రహదారి సిబ్బంది క్షతగాత్రులను కొంపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్​ జగదీశ్వర్​కు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ పరీక్షలు చేయగా 95/100ఎంజీగా తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details