జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో తల్లీకూతురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కుమార్కు జగిత్యాల జిల్లాకు చెందిన లాస్యతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల పాప మహిత ఉంది. కొంతకాలం క్రితం భూపాలపల్లి సింగరేణి కేటీకే ఒకటో గనికి కుమార్ బదిలీపై వచ్చారు.
రెండున్నర ఏళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య
భర్త ఉద్యోగానికి వెళ్లి వచ్చేలోపు రెండున్నర ఏళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
భూపాలపల్లిలో రెండున్నర ఏళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య
శుక్రవారం కుమార్ ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లాస్య, కూతురు మహిత ఉరివేసుకుని కనిపించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు.
ఇదీ చదవండిఃఆ వెంచర్లోకి ఇసుక ఎలా వచ్చింది.. ఎవరు నిల్వ చేశారు?