ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుతపులి మృతి చెందింది. గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రోడ్డుప్రమాదంలో చిరుత మృతి.. అధికారులు ఏమన్నారంటే? - Leopard dead news
ఆదిలాబాద్ జిల్లా మేకలగండి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిరుతపులి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు.. నీరు తాగేందుకు వచ్చి ప్రమాదానికి గురై ఉంటుందని అనుమానిస్తున్నారు.

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి.. అధికారులు ఏమన్నారంటే?
అటవీ, పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతి చెందినది ఆడ చిరుతగా గుర్తించిన అటవీ అధికారులు.. నీరు తాగేందుకు వచ్చి ప్రమాదానికి గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఓవైపు పులి దాడులతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జనం బెంబేలెత్తుతుండగా.. మరోవైపు తాజా ప్రమాదంలో చిరుత మృతి చెందడం కలకలం రేపుతోంది.