ఆర్థిక ఇబ్బందులకు తోడు లాక్డౌన్ కారణంగా కంపెనీ నుంచి జీతం సరిగ్గా అందకపోవడం ఓ ఉద్యోగి మృతికి కారణమైంది. తమిళనాడు తిరుత్తనికి చెందిన లక్ష్మీనారాయణ శివకుమార్ నిజాంపేట్ రోడ్డులోని భవ్యాస్ ఆనందం అపార్ట్‌మెంట్స్‌లో కుటుంబంతో నివాసముంటున్నాడు. ఎర్రమంజిల్‌లోని నెక్సస్ కంపెనీలో అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా పూర్తి జీతం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఉద్యోగి ప్రాణం తీసిన సగం జీతం
పూర్తి జీతం చేతికందినా నెల గడవని మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో. అప్పో సొప్పో చేసి సంసారాన్ని నెట్టుకొస్తున్న వీరిపై లాక్డౌన్ పిడుగులా పడింది. ఉద్యోగ సంస్థలు ఇచ్చే అరకొర జీతాలు మధ్యతరగతి వారిని పూర్తిగా చీకట్లోకి నెట్టేశాయి. చేసేదేం లేక చావే శరణ్యమనుకుంటున్న వారేందరో? కుటుంబ పోషణ భారమైందనే మనస్తాపంతో హైటెన్షన్ విద్యుత్ స్తంభానికి ఉరేసుకున్నాడు కేపీహెచ్పీ కాలనీకి చెందిన ఓ ఉద్యోగి.
ఉద్యోగి ప్రాణం తీసిన సగం జీతం
కుటుంబ పోషణ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన శివకుమార్.. ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో చెప్పకుండా వెళ్లి శివాలయం వెనుకనున్న హైటెన్షన్ విద్యుత్ స్తంభానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శివకుమార్ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి:కాళేశ్వరం అద్వితీయం... కొండపోచమ్మకు గోదావరి పరుగులు