యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని నల్లచెరువులో దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు వలిగొండ మండలం లోతుకుంటకు చెందిన సుంకబుడ్డి అనూరాధగా పోలీసులు గుర్తించారు. శనివారం.. అనూరాధపై యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయింది. విచారణ చేస్తుండగా.. చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. అనుమానాలు లేవన్న కుటుంబం! - suicide news in yadagirigutta
చెరువులో దూకి బీటెక్ చదువుతోన్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. యువతిపై శనివారం.. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైంది.

యువతి ఆత్మహత్య, నల్ల చెరువు, యాదగిరిగుట్ట
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శవపంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా అనూరాధ మరణంపై కుటుంబీకులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు.
ఇదీ చదవండి:పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు