వరంగల్ అర్బన్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామశివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది కూలీలు గాయపడ్డారు.
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు - accident in warangal urban district
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి పదిమంది గాయపడిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామశివారులో చోటుచేసుకుంది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా
క్షతగాత్రులను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి:క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడమే ముఖ్యం: ఈటల