తెలంగాణ

telangana

By

Published : May 17, 2021, 9:51 AM IST

ETV Bharat / international

గాజాపై ఆగని వైమానిక దాడులు

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న హింస రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. హమాస్​ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజా నగరంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఉదయం మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఆదివారం గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో 42మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మూడు ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. గాజాపై దాడులను కొనసాగిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్​ ప్రధాని ​ నెతన్యాహు స్పష్టం చేశారు.

Israel stages new round of heavy airstrikes on Gaza City
ఇజ్రాయెల్- పాలస్తీనా దాడులు

హమాస్ ఉగ్రవాదులు లక్ష్యంగా గాజా నగరంలో ఇజ్రాయెల్ సోమవారం ఉదయం 10 నిమిషాల పాటు ఆగకుండా వైమానిక దాడులు కొనసాగించింది. ఆదివారం గాజాలో జరిగిన వైమానిక దాడుల్లో 42మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మూడు ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయి. మరోవైపు ఇరు వర్గాల మధ్య నాలుగో యుద్ధానికి సంకేతాలు ఇచ్చే దిశగా.. గాజాపై దాడులను కొనసాగిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

10నిమిషాల్లో విధ్వంసం..

గాజా నగరంపై వైమానిక దాడులు
గాజా నగరంపై దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్

గాజా నగరంలో 10నిమిషాల పాటు ఆగకుండా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో నగరం గజగజ వణికిపోయింది. ఈ దాడుల్లో 42 మంది పాలస్తీనా వాసులు మృతిచెందారు. గాజా నగరంలోని తీర ప్రాంతం, విద్యుత్ ప్లాంట్​లు లక్ష్యంగా ఇజ్రాయెల్ సోమవారం ఉదయం దాడులు నిర్వహించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

తగిన మూల్యం చెల్లించాల్సిందే..

అవసరమైనన్ని రోజులు గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్థానిక మీడియాతో అన్నారు. అటు హమాస్​ సైతం.. ఇజ్రాయెల్​లో జనసంచారం ఎక్కువగా ప్రాంతాల్లో దాడులు చేస్తామని స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్​ దాడిలో నేలమట్టమైన భవనం

200కు చేరువలో..

ఈ నెల 10న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాద సంస్ధ ప్రారంభించిన రాకెట్‌ దాడులతో ఇజ్రాయెల్‌-పాలస్తీనాలో ఇప్పటివరకు మొత్తం 192 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. వారిలో 58 మంది చిన్నారులు కాగా, 34 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్​లో ఇప్పటివరకు 10 మంది మరణించినట్లు ఆ దేశం పేర్కొనగా.. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు స్పష్టం చేసింది.

రాకెట్​ల వర్షం
దాడుల్లో మృతి చెందిన పాలస్తీనా ప్రజలు

ఐరాస అత్యవసర సమావేశం..

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య నెలకొన్న హింసపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. ఈ సమావేశంలో ఐరాస దౌత్యవేత్తలు, ముస్లిం విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్.. గాజాపై చేస్తున్న దాడులను పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్​ ఆల్-మల్కీ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దేశం యుద్ధనేరాలకు పాల్పడుతోందన్నారు. జెరుసలెం నుంచి పాలస్తీనా ప్రజలను వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

తీవ్రంగా కృషి చేస్తున్నాం..

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య నెలకొన్న యుద్ధవాతావరణాన్ని సద్దుమణిగించేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఐరాసలోని అమెరికా రాయబారి లిందా థామస్ గ్రీన్​ఫీల్డ్ తెలిపారు. చర్చలతోనే ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించవచ్చన్నారు.

ఇదీ చదవండి:'ఇజ్రాయెల్-పాలస్తీనా ఇకనైనా శాంతించాలి'

ABOUT THE AUTHOR

...view details