తెలంగాణ

telangana

ETV Bharat / international

కష్టమైన పోటీకే సవాలు విసురుతున్న ఛాంపియన్

అత్యంత క్లిష్టమైన పోటీని అలవోకగా ఛేదిస్తున్నాడు ఖతార్​కు చెందిన ఫైజల్ అల్​ ఖతానీ. మూడేళ్లపాటు ఛాంపియన్​ అతడే. పోటీల్లో వరుసగా సత్తా చాటుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అసలు ఏమిటా పోటీ అని తెలుసుకోవాలనుందా? అయితే చూడండి మరి!

కష్టమైన పోటీకే సవాలు విసురుతున్న ఛాంపియన్

By

Published : Mar 24, 2019, 12:15 PM IST

కష్టమైన పోటీకే సవాలు విసురుతున్న ఛాంపియన్
"సామ్లా డెసర్ట్ ఎక్స్​ట్రీమ్"... ఖతార్​లో నిర్వహించే అత్యంత కష్టమైన సాహసక్రీడా పోటీ. దీనిని ఎనిమిది దశలుగా విభజిస్తారు. ఇసుక సహా రన్నింగ్​ ట్రాక్​లపై పరుగులు, ఈత, సైక్లింగ్, పడవ పోటీలు, షూటింగ్​... ఇలా 190 కిలోమీటర్ల పాటు సాహసాలు చేస్తూ ఈ టైటిల్​ను ఛేదించాల్సి ఉంటుంది. ఇది వింటేనే చాలా మంది... అమ్మో! నా వల్ల కాదు అనుకుంటారు. చాలా ఫిట్​నెస్​ ఉండాలంటారు.

ఇలాంటి పోటీల్లో ఒక్కసారి గెలవడమే కష్టమనుకుంటే... ఫైజల్ అల్​ ఖతానీ అనే క్రీడాకారుడు మూడుసార్లు టైటిల్​ను సొంతం చేసుకున్నాడు. ఇంత కష్టమైన పోటీల్లో గత రెండు టైటిళ్లు నెగ్గి ఛాంపియన్​గా నిలిచిన ఫైజల్​... తాజాగా 2019 టైటిల్​నూ కైవసం చేసుకున్నాడు. ఈసారి ఏకంగా 21 గంటల 41 నిమిషాల్లోనే పూర్తి చేశాడు ఫైజల్.

మరి ఇంత కష్టమైన పోటీ కాబట్టే ప్రైజ్​మనీ కూడా అంతే ఇష్టంగా ఉంటుంది. ఎంతో తెలుసా... 1,37, 300 అమెరికన్ డాలర్లు.

ABOUT THE AUTHOR

...view details