Amber Heard Elon musk: స్టార్ నటులు జానీ డెప్, అతడి మాజీ భార్య అంబర్ హెర్డ్ కోర్టు కేసుపైనే హాలీవుడ్ దృష్టంతా నెలకొని ఉంది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వాషింగ్టన్పోస్ట్లో కథనం రాసినందుకు.. అంబర్ హెర్డ్‌పై పరువు నష్టం దావా వేశారు జానీ డెప్. ప్రస్తుతం ఈ విచారణ వాడీవేడీగా సాగుతోంది. జానీ, అంబర్లతో పాటు, వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులను... న్యాయమూర్తులు, జ్యూరీ విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ అన్నీ వదిలేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నటీనటులిద్దరూ స్వతహాగా చాలా గొప్పవారంటూ ట్వీట్ చేశారు.
మస్క్, అంబర్ హెర్డ్ ఇదివరకు రెండుసార్లు డేటింగ్ చేశారు. జానీ డెప్తో విడిపోయిన తర్వాత మస్క్‌తో రిలేషన్షిప్ ప్రారంభించిన అంబర్ హెర్డ్.. ఏడాది తర్వాత 2017లో విడిపోయారు. మళ్లీ 2018లో కలిశారు. ఈసారి కొద్దిరోజులకే విడిపోయారు. అయితే, జానీ డెప్ మాత్రం.. వీరిద్దరి మధ్య సంబంధాలు చాలా ముందే ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. 2015 ఫిబ్రవరిలో అంబర్హెర్డ్తో జానీ డెప్ వివాహం జరిగింది. పెళ్లైన నెల లోపే అంబర్ హెర్డ్... ఎలాన్ మస్క్‌తో డేటింగ్ ప్రారంభించారని ఆరోపిస్తున్నారు.