తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2020, 9:06 PM IST

ETV Bharat / international

ఫైజర్ టీకాతో అలర్జీ- ప్రజలకు బ్రిటన్ హెచ్చరిక

టీకా స్వీకరించిన ఇద్దరు వైద్య సేవల సిబ్బందికి అలర్జీలు తలెత్తిన నేపథ్యంలో ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ. అలర్జీ సమస్యలు ఉన్నవారు టీకా తీసుకోవద్దని సూచించింది. ఇక నుంచి ప్రతి ఒక్కరి వైద్య చరిత్ర సమీక్షించిన తర్వాత టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది.

UK probes possible allergic reactions to COVID-19 shot
ఫైజర్ టీకాతో అలర్జీ- ప్రజలకు బ్రిటన్ హెచ్చరిక

బ్రిటన్​లో టీకా పంపిణీ ప్రారంభమైన ఒక్కరోజుకే ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది అక్కడి నియంత్రణ సంస్థ. మెడిసిన్లు, ఆహారం, టీకాలు తీసుకున్నప్పుడు తీవ్రమైన అలర్జీ తలెత్తే వ్యక్తులు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవద్దని స్పష్టం చేసింది. టీకా స్వీకరించిన ఇద్దరు జాతీయ వైద్య సేవల(ఎన్​హెచ్ఎస్) సిబ్బందికి ఇలాంటి సమస్య(అనాఫిలాక్టోయిడ్ రియాక్షన్) తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

టీకా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని ట్రస్టులకు ఈ సమాచారాన్ని అందించినట్లు ఎన్​హెచ్​ఎస్ ఇంగ్లాండ్ తెలిపింది. బుధవారం నుంచి వ్యాక్సిన్ స్వీకరించే ప్రతి ఒక్కరికి.. గతంలో ఇలాంటి అలర్జీలు తలెత్తాయా లేదా అన్న సమాచారాన్ని నిర్ధరించుకుంటామని స్పష్టం చేసింది.

సర్వసాధారణమే!

అనాఫిలాక్టోయిడ్ రియాక్షన్ వల్ల చర్మంపై దద్దుర్లు రావడం, ఊపిరాడకపోవడం, రక్తపోటు పడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీని ప్రభావానికి లోనైన ఇద్దరు ఎన్​హెచ్ఎస్ కార్యకర్తలకు గతంలో తీవ్రమైన అలర్జీల సమస్య ఉందని తెలుస్తోంది. ఇందుకోసం వీరిద్దరు అడ్రినలైన్ పెన్నులను కూడా ఎప్పుడూ వెంట తీసుకెళ్తారని సమాచారం.

అయితే ఇలాంటి ప్రభావాలు తలెత్తడం సాధారణమేనని ఎన్​హెచ్​ఎస్ ఇంగ్లాండ్ డైరెక్టర్ స్టీఫెన్ పోవిస్ తెలిపారు. వార్షిక ఫ్లూ టీకాల్లోనూ ఇలాంటి ప్రభావం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details