భాతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కుటుంబం ఓ ఆసుపత్రికి వెంటిలేటర్‌ను విరాళంగా అందించింది. కరోనా మహమ్మారితో వైద్య పరికరాల కొరత ఏర్పడిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
స్టీఫెన్ హాకింగ్ కోసం ఉపయోగించిన ఈ వెంటిలేటర్‌ను ఇంగ్లాండ్ కేంబ్రిడ్జిలోని రాయల్ పాప్‌వర్త్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చినట్లు ఆయన కుమార్తె లూసీ తెలిపారు.
"నా తండ్రి వెంటిలేటర్‌కు పరిమితమైనప్పుడు రాయల్ పాప్‌వర్త్ ఆసుపత్రి సేవలు మరవలేనివి. కష్ట సమయాల్లో మాకు ఎంతో సాయం చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో దీని అవసరం ఎంతో ఉంటుందని గ్రహించాం. అందుకు మేము ఏం సాయం చేయగలమా అని స్నేహితులతో చర్చించి చివరకు ఈ వెంటిలేటర్‌ను అందించాం. "