Russia Ukraine War 10th Day: ఉక్రెయిన్‌పై యుద్ధభేరి మోగించిన రష్యా పదోరోజు దాడులు చేసింది. రాజధాని కీవ్‌తోపాటు పలు నగరాలపై మాస్కో సేనలు దండెత్తాయి. దక్షిణ ప్రాంతంలోని నగరాలపై పట్టు కోసం శక్తివంతమైన ఆయుధాలు వాడుతున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. రెండో పెద్ద నగరమైన ఖార్కివ్.. ఈ తెల్లవారుజామున వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. ఖార్కివ్, చెర్నిహివ్, మరియుపోల్, సుమీ నగరాలను పుతిన్ సేనలు చుట్టుముట్టాయి. సముద్ర తీరంతో ఉక్రెయిన్‌కు సంబంధాలు లేకుండా చేసే లక్ష్యంతో తీర ప్రాంత నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
ఈటీవీ భారత్‌కు లైవ్ దృశ్యాలు
Russia attacking Ukraine live visuals: రాజధాని కీవ్ నగరంపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. నివాస ప్రాంతాలను కూడా లక్ష్యం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు 'ఈనాడు- ఈటీవీ భారత్'కు అందాయి. ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు వడీం ఇచెంకో ఫోటోలు, వీడియోల ద్వారా తమదేశంలో రష్యా దాడుల తీవ్రతను బయటి ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలను చూసేందుకు ఈ లింక్‌పై క్లిక్చేయండి.
ప్రతిఘటన...
క్రెమ్లిన్ దాడులను ఉక్రెయిన్ బలగాలు గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి. రష్యా సేనలకు ఆహారం, నీరు అందకుండాచేసే.. వ్యూహం అమలు చేస్తున్నాయి. మాస్కో బలగాల నుంచి జపోరిజియా అణువిద్యుత్ కేంద్రాన్ని తిరిగి కైవసం చేసుకున్నాయి. మరియుపోల్‌ను రష్యా బలగాలు దిగ్బంధించాయన్న మేయర్.. ఆక్రమణదారుల నుంచి తమ నగరాన్ని కాపాడేందుకు తమ బలగాలు పోరాడుతున్నట్లు వెల్లడించారు. ఒడెసాలోనూ రష్యా సైన్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.
మాతృభూమి రక్షణ కోసం విదేశాల్లో ఉన్న 66,224 మంది స్వదేశానికి వచ్చినట్లు ఉక్రెయిన్ రక్షణమంత్రి తెలిపారు. తమ సేనలు జనావాసాలపై కూడా దాడులు చేస్తున్నాయన్న వార్తలు నకిలీవని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్‌తో ఫోన్‌లో మాట్లాడిన పుతిన్ కీవ్‌సహా ప్రధాన నగరాలపై వైమానిక దాడుల వార్తలు నకిలీవని పేర్కొన్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.
పది వేల మంది రష్యా సైనికులు మృతి