భారత్తో వాణిజ్య-పెట్టుబడులను మరింత బలోపేతం చేసే దిశగా బ్రిటన్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈటీపీ(ఎన్హాన్సడ్ ట్రేడ్ పార్ట్న్నర్షిప్)లో భాగంగా జీబీపీ 1 బిలియన్ విలువ గల ఒప్పందాలు భారత్తో కుదుర్చుకోనుంది బ్రిటన్. ఫలితంగా బ్రిటన్లో 6,500 కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. మంగళవారం జరగనున్న భేటీలో భారత్-బ్రిటన్ ప్రధానులు నరేంద్ర మోదీ- బోరిస్ జాన్సన్లు ఈ ఈటీపీపై సంతకాలు చేస్తారు.
2030 నాటికి బ్రిటన్-భారత్ వాణిజ్య విలువను రెండింతలు చేసేందుకు ఈ ఈటీపీ ఉపయోగపడుతుంది. ఎఫ్టీఏ(ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్) వైపు అడుగులు వేసేందుకు ఇది పనికొస్తుంది.
"భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో ఇతర అంశాల్లాగే ఆర్థిక బంధం కూడా బలమైనది. మేము ప్రకటించిన 6,500 ఉద్యోగాలు కరోనా నుంచి కోలుకునేందుకు ఉపయోగపడతాయి. రానున్న దశాబ్ద కాలంలో.. భారత్-బ్రిటన్ వాణిజ్య విలువ రెండింతలయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది."
--- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధానమంత్రి.