క్రొయోషియా రాజధాని జాగ్రెబ్‌లోని నర్సింగ్ హోంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషాదం ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
వాయువ్య పట్టణం ఒరోస్లావ్‌జేలోని నర్సింగ్ హోంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉదయం 5.00 గంటలకు మంటలకు చెలరేగాయని పోలీసులు తెలిపారు.ప్రమాద సమయంలో ఆశ్రమంలో ఎంత మంది ఉన్నారనేది తెలియలేదన్నారు.కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.