అఫ్గానిస్థాన్ కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 30కు చేరినట్లు భద్రతాధికారులు వెల్లడించారు. మరో 70మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన 37 మందిని జిన్నా ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆత్మాహుతి దాడిలో 30కి చేరిన మృతులు
అఫ్గానిస్థాన్ కాబూల్‌లో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 30కు చేరింది. మరో70మంది చికిత్స పొందుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి -30కు చేరిన మృతుల సంఖ్య
కాబుల్‌లోని ఓ విద్యాకేంద్రం వెలుపల పేలుడు జరిగినట్లు అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తరీఖ్ అరియన్ వెల్లడించారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి లోనికి ప్రవేశిస్తుండగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్న సమయంలో ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.
ఇదీ చదవండి :అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి