కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో కేవలం పదిరోజుల్లోనే వుహాన్లో వెయ్యి పడకల తాత్కాలిక ఆస్పత్రి నిర్మించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది చైనా. అత్యాధునిక వైద్య సదుపాయాలతో.. నదీ ప్రవాహంలా వచ్చే రోగులకు అందులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఇక్కడి వైద్య సిబ్బంది అత్యంత జాగ్రత్తగా.. తమకు వైరస్ సోకకుండా చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బందిని వుహాన్ తాత్కాలిక ఆస్పత్రి డైరెక్టర్ జాంగ్ జుంజియాన్ ప్రశంసలతో ముంచెత్తారు.
ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిందని, ఈ పరిస్థితి ఈనెల చివరి నాటికి పూర్తిగా తగ్గుతుందని అశాభావం వ్యక్తం చేశారు జుంజియాన్.