ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకూ సుమారు 3 కోట్ల 49 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు. 10లక్షల 34వేల మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు 2కోట్ల 59లక్షల మందికిపైగా వైరస్‌ను జయించగా.. 79 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు.
సింగపూర్‌లో ఆంక్షలు సడలింపు
సింగపూర్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా అక్కడి ప్రభుత్వం ఆంక్షల్లో సడలింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆ దేశంలో శనివారం 6 కొత్త కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 57,800కు చేరింది. ఇప్పటివరకు అక్కడ 27 మంది వైరస్‌తో చనిపోయారు.
నేపాల్ పీఎం ప్రధాన సలహాదారుకు కరోనా
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రధాన సలహాదారు సహా మరో ఇద్దరు సహాయకులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఇటీవల తమను కలిసిన వారంతా తగు జాగ్రత్తలు పాటించాలని ట్విట్టర్, ఫేస్బుక్లో కోరారు. నేపాల్‌లో కొత్తగా 528 కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 84,500 దాటింది.
- కొవిడ్ కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 75.55 లక్షల మందికి వైరస్ సోకింది. కరోనాతో 2.13లక్షల మందికిపైగా ప్రాణాలు విడిచారు.
- రష్యాలో కొత్తగా 9,859 కరోనా కేసులు వెలుగు చూడగా.. బాధితుల సంఖ్య 12,04,502కు ఎగబాకింది. మరో 128 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 21,251కి చేరింది.
- మెక్సికోలో శనివారం ఒక్కరోజే 4,775 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 7,53,090కు పెరిగింది. వైరస్ సోకిన వారిలో మరో 414 మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 78,492కు ఎగబాకింది.
- పాక్‌లో మరో 553 మందికి కొవిడ్ సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3లక్షల 14వేలకు చేరువైంది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,507 మంది వైరస్ కారణంగా మరణించారు.
ఇదీ చదవండి:'అధ్యక్షుడికే కరోనా.. ఇకనైనా తీవ్రంగా పరిగణించండి'