తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇస్లాం గడ్డపై పోప్ ఫ్రాన్సిస్​​ - యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్

యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​లో పోప్ ఫ్రాన్సిస్​ మూడు రోజుల పర్యటన. ఇస్లాం దేశాన్ని పర్యటించిన మొట్ట మొదటి పొప్​గా గుర్తింపు

pope

By

Published : Feb 4, 2019, 5:55 AM IST

pope francis
ఇస్లాం మత జన్మస్థలం అరేబియా ద్వీపకల్పం యూఏఈ దేశానికి పోప్​ ఫ్రాన్సిస్​ చారిత్రక పర్యటన చేపట్టారు. ఇస్లాం దేశాన్ని పర్యటించిన మొట్ట మొదటి పొప్​గా చరిత్ర సృష్టించారు పోప్​ ఫ్రాన్సిస్​. ​ ఈ యాత్ర క్రైస్తవ​-ముస్లిం మతాల మధ్య సంబంధాల బలోపేతానికి ఓ కొత్త అధ్యాయంగా నిలవనుంది.

యెమన్​లో ఉగ్రవాద నిర్మూలనకు యూఏఈ రక్షణ దళాలు చాలా కాలంగా మోహరించాయి. దీర్ఘకాలం పాటు సాగే యుద్ధం వల్ల యెమన్​లో జనాభా తగ్గిపోతుందని పోప్​ అన్నారు. చాలా మంది పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు కానీ ఆహారాన్ని పొందలేకపోతున్నారని పోప్​ అన్నారు. ఆహార పంపిణీకి భరోసా కల్పించే సంస్థల ఒప్పందాలను అనుమతించాలని అంతర్జాతీయ సంస్థలను, సంబంధిత పార్టీలను కోరారు.

యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇరు మతాల​ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం క్రైస్తవ మత సభ్యులతో సమావేశం కానున్నారు.

" అరేబియన్​ గల్ఫ్​ చరిత్రలో అతి పెద్ద క్రైస్తవ ఆరాధన నిర్వహణను మేం చూస్తున్నాం. అందులో మేము భాగమైనందుకు సంతోషిస్తున్నాం."
- ఆండ్రూ థామ్సన్​, సెయింట్​ ఆండ్రూ ఆంగ్లికన్ చర్చి ప్రతినిధి, అబుదాబి

యూఏఈలో ఫిలిప్పైన్స్​, భారత్​ నుంచి వచ్చిన సుమారు పది లక్షల మంది క్యాథలిక్​ వలసదారులు నివాసముంటున్నారు. మంగళ వారం జియాద్​ స్పోర్ట్​ సిటీ మైదానంలో నిర్వహించే సమావేశానికి ఇప్పటికే సుమారు 135,000 మంది టికెట్స్​ పొందారు.

ABOUT THE AUTHOR

...view details